Manipur Violence | మణిపూర్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ
Manipur Violence | నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు (Internet restored).
Manipur Violence | నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు (Internet restored). మే 3న కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడటంతో ఇంటర్నెట్ సేవలను తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (N Biren Singh) శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సదుపాయాలు సహా వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ శాంతి నెలకొనలేదు సరికదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. ఇప్పటికీ కొందరు అల్లరి మూకలు, నిషేధిత ఉగ్రవాదులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,118 మంది గాయపడ్డారు. సుమారు 33 మంది అదృశ్యమయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది.
Also Read..
Justin Trudeau | భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. అమెరికా మొగ్గు ఎవరివైపంటే..?
Heavy Rains | రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన నాగ్పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు
Rat Bitese | 6 నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి.. ఎముకలు బయటకు వచ్చేలా కొరికి తినేసిన వైనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

