Rat Bitese | 6 నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి.. ఎముకలు బయటకు వచ్చేలా కొరికి తినేసిన వైనం
Rat Bitese | అగ్రరాజ్యం అమెరికా (America)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందు (6 Month Old Baby )పై ఎలుకల గుంపు దాడి చేసి చంపేసింది.
Rat Bitese | అగ్రరాజ్యం అమెరికా (America)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందు (6 Month Old Baby )పై ఎలుకల గుంపు దాడి చేసి చంపేసింది. ఈ ఘటన స్థానిక ఇండియానా (Indiana) ప్రాంతంలో ఆగస్టు 13వ తేదీన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఇండియానా పోలీసులు (Police) చిన్నారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఇండియానాలో నివాసం ఉండే డేవిడ్, ఏంజెల్ షోనాబామ్ దంపతుల ఆరు నెలల పసికందు ఊయలలో హాయిదా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఎలుకల గుంపు చిన్నారిపై దాడి చేసింది. మొత్తం 50 సార్లకు పైగా ఆ చిన్నారిని ఎలుకలు కరిచాయి. ముఖం, కాళ్లు, చేతులను కొరికి తినేశాయి. ఎంతలా అంటే ఎలుకల దాడిలో ఆ చిన్నారి శరీరంలోని ఎముకలు కూడా బయటకు వచ్చేలా కొరికేశాయి. రక్తం మడుగుల్లో ఉన్న చిన్నారిని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
సమాచారం తెలుసుకున్న ఇండియానా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిన్నారి కంటే ముందు ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వీరితోపాటు మరో ఇద్దరు బంధువుల పిల్లలు కూడా వీరితోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ కుటుంబం నివసించే ఇల్లంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇల్లంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఉందని పేర్కొన్నారు. దీంతో ఆ చెత్తకింద ఎలుకలు ఆవాసం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ఇంట్లో ఎలుకలు చిన్నారులను కొరకడం ఇది మొదటిసారి కాదని వారు తెలిపారు. గతంలో కూడా ఇలానే ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులపై ఎలుకలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు చెప్పారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు పసికందు తల్లిదండ్రులు సహా, ఆ ఇంట్లో ఉంటున్న మరో మహిళపై కేసు నమోదు చేసి ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Heavy Rains | రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన నాగ్పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు
Kamal Haasan | చిన్నపిల్లాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారు.. సనాతన ధర్మంపై కమల్హాసన్
Justin Trudeau | ఆ విశ్వసనీయ సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్కు వెల్లడించాం : ట్రూడో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

