Viral Video | ఓ ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించాలని ప్రయత్నించిన ఓ యూట్యూబర్ (Influencer) చివరికి తానే ఫూల్ అయ్యింది. హోటల్ సిబ్బందికి తప్పుడు సమాచారం ఇచ్చి ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ (Free Breakfast) చేసి.. చివరికి రూ.వేలల్లో బిల్లు కట్టింది. ఈ ఘటన న్యూ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సదరు యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీ (Delhi)కి చెందిన కంటెంట్ క్రియేటర్ నిషు తివారీ.. చాణక్యపురి (Chanakyapuri)లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోకి ఉచిత అల్పాహారం కోసం వెళ్లింది. నైట్ డ్రెస్‌లో హోటల్లోకి ప్రవేశించిన ఆమె.. అతిథిగా నటిస్తూ సిబ్బందిని బురిడీ కొట్టించింది. బ్రేక్ ఫాస్ట్ ఏరియాలోకి వెళుతుండగా ఎంట్రెన్స్ లో హోటల్ సిబ్బంది ఆమె దిగిన రూమ్ నెంబర్ అడగ్గా.. ఓ గది నెంబర్ చెప్పి లోపలికి వెళ్లింది. అక్కడ బఫే సిస్టమ్ కావడంతో నచ్చిన ఆహారాన్ని లాగించేసింది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో ఎగ్జిట్ వద్ద ఆమెను హోటల్ సిబ్బంది అడ్డగించారు.
తన రూమ్ వివరాలు కరెక్ట్‌గా చెప్పాలని ప్రశ్నించారు. దీంతో దొరికిపోయానని గ్రహించిన నిషు.. అసలు విషయం చెప్పేసింది. చివరికి తాను తిన్న ఫుడ్‌కు ఏకంగా రూ.3,600 బిల్లు చెల్లించింది. తన జీవితంలో ఇదే అత్యంత ఖరీదైన బ్రేక్ ఫాస్ట్‌గా ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Yogi Adityanath | యూపీలో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారు : యోగి ఆదిత్యనాథ్
Etihad Airways | భారతీయులకు ఎతిహాద్ ఎయిర్వేస్ బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై 30% డిస్కౌంట్
Bhupesh Baghel | భూపేశ్ బఘేల్ చుట్టూ కేసుల ఉచ్చు.. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సీబీఐ దాడులు