bomb threat | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ దాడుల నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai airport)కు బాంబు బెదిరింపు (bomb threat) కాల్ రావడం కలకలం రేపుతోంది.
చండీగఢ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానంలో బాంబు ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌కు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. ఆ విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరించారు. అయితే, విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. భద్రతా బలగాలు వెంటనే విమానాన్ని ఖాళీ చేయించి.. తనిఖీలు నిర్వహించారు. అయితే, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభ్యం కాలేదు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్‌పై ప్రతీకార దాడుల వేళ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Operation Sindoor: మిస్సైల్ దాడి.. భారీగా పేలుడు.. బైక్‌పై జనం పరుగులు.. ఆపరేషన్ సిందూర్ వీడియో
LoC | నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు.. పది మంది భారత పౌరులు మృతి
Operation Sindoor | ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పాక్.. ఫ్యాక్ట్ చెక్‌తో తిప్పికొట్టిన భారత్