LoC | నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు.. పది మంది భారత పౌరులు మృతి
LoC | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
LoC | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పది మంది భారత పౌరులు ప్రాణాలు (Civilians Killed) కోల్పోయారు. అమాయక ప్రజలను పాక్ బలిగొందని భారత సైన్యం తెలిపింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. దీనికి బదులు తీర్చుకుంటామని పేర్కొంది.
ఇక భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో భాగంగా మొత్తం 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించి, మిస్సైళ్లతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. మొత్తం తొమ్మిది స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి అర్ధరాత్రి భారత సైన్యం ఎక్స్‌లో పోస్టు చేసింది. మరోవైపు భారత్ జరిపిన ఈ దాడుల్లో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Also Read..
Operation Sindoor | ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పాక్.. ఫ్యాక్ట్ చెక్‌తో తిప్పికొట్టిన భారత్
Pakistan Airspace | ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఎయిర్‌స్పేస్ ఖాళీ.. బిజీగా మారిన భారత్ గగనతలం
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఆ 9 ఉగ్ర స్థావరాలనే ఎందుకు టార్గెట్ చేశారంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

