Operation Sindoor | పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యకు పూనుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులకు దిగింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో భారత్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది. ఈ ఫేక్ ప్రచారాన్ని సైతం భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు పాక్ ఆర్మీ చెప్పినట్లు అక్కడి మీడియా సంస్థలు సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ మేరకు కొన్ని వీడియోలను కూడా వైరల్ చేశాయి. దీనిపై స్పందించిన భారత్.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా పాక్‌కు బుద్ధి చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చింది. ఆ వీడియోలన్నీ పాతవే అని తేల్చింది. 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్‌లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్ చేస్తున్నట్లు తెలిపింది. పాక్ చేస్తున్న తప్పుడు వార్తల ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు కేంద్రం సూచించింది.
Also Read..
Lashkar-e-Taiba | ‘టెర్రర్ నర్సరీ’గా ‘ముర్కిదే’.. లష్కరే తోయిబా ప్రధాన స్థావరం ఇక్కడే
Pakistan Airspace | ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఎయిర్‌స్పేస్ ఖాళీ.. బిజీగా మారిన భారత్ గగనతలం
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఆ 9 ఉగ్ర స్థావరాలనే ఎందుకు టార్గెట్ చేశారంటే?