న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్ర స్థావరాలపై ఇండియా టార్గెట్ చేసింది. మిస్సైల్ అటాక్‌కు పాల్పడింది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఆపరేషన్‌కు చెందిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో క్షిపణి పేలుడు స్పష్టంగా ఉన్నది. భారీగా జనం ఉన్న ప్రదేశం వద్ద.. ఎక్కువగా మంది బైక్‌పై ఉన్నారు.. ఆ బిజీ రోడ్డుకు సమీపంలోనే క్షిపణి అటాక్ జరిగింది. అర్థరాత్రి కావడంతో ఆ చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఒక్కసారిగా ఆరెంజ్ కలర్ విస్పోటనం జరిగింది. క్షణాల్లో మంటలు, స్మోక్ వ్యాపించాయి. బైక్‌లపై ఉన్న జనం పరుగులు తీయడం మొదలు పెట్టారు. ఆ వీడియోను వీక్షించండి.
Operation Sindoor, a mission to avenge the sindoor wiped from the foreheads of our mothers and sisters in Pahalgam. What a powerful and fitting name for this tribute!
Jai Hind.pic.twitter.com/6u5yX3X2g1
— THE SKIN DOCTOR (@theskindoctor13) May 7, 2025
మరో వీడియోలో భారీ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత భారీగా పేలుడు జరిగింది. ఇండియన్ మిస్సైల్ అటాక్ వల్ల ఆ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఎయిర్ లాంచర్‌తో పేల్చినట్లు అనుమానిస్తున్నారు. దీని కోసం లాంగ్ రేజ్ స్కాల్ప్ లేదా హ్యామర్ స్మార్ట్ బాంబులను వాడినట్లు అంచనా వేస్తున్నారు. ఆ భారీ పేలుడుకు వీడియో తీస్తున్న వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడు.