Glass Bridge | దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం ఒకటి. అక్కడ ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు నిత్యం తమిళనాడుకు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్ బ్రిడ్జ్ (Indias First Glass Bridge)ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన (Glass Bridge)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ప్రారంభించారు.
#WATCH | Kanniyakumari: Tamil Nadu Chief Minister MK Stalin inaugurated a glass bridge over the sea, connecting Tiruvalluvar Statue and Vivekananda Rock Memorial, in Kanniyakumari yesterday
(Source: Tamil Nadu DIPR) pic.twitter.com/86src7srTI
— ANI (@ANI) December 31, 2024
కన్యాకుమారి (Kanyakumari) తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని (Thiruvalluvar statue) ప్రతిష్టించారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది.
Tamil Nadu Chief Minister MK Stalin will inaugurate the new glass fiber bridge connecting Vivekananda Rock Memorial and the Thiruvalluvar Statue in Kanyakumari. #Kanyakumariglassbridge pic.twitter.com/8jfU6aw3Ri
— The Tatva (@thetatvaindia) December 30, 2024
77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు. దీనికి గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలె పూర్తయింది. రేపటి నుంచి సిల్వర్‌జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను సీఎం ప్రారంభించారు. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Current status of the glass bridge under construction between Vivekandar Rock & Thiruvalluvar statue at Kanyakumari pic.twitter.com/Oa7S0WcBxw
— Tamil Nadu Infra (@TamilNaduInfra) December 1, 2024
முக்கடல் சூழும் குமரி முனையில் அய்யன் திருவள்ளுவர் சிலை வெள்ளி விழா !#CMMKSTALIN | #DyCMUdhay | #TNDIPR |@CMOTamilnadu @mkstalin@katpadidmk @Udhaystalin @KN_NEHRU @IPeriyasamymla @KPonmudiMLA @evvelu @mp_saminathan @KanimozhiDMK @Chief_Secy_TN pic.twitter.com/epUdaIisD8
— TN DIPR (@TNDIPRNEWS) December 30, 2024
Also Read..
Last Sunrise | ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యోదయం.. చూసేయండి.. VIDEOS
ISRO | జనవరిలో ఇస్రో 100వ మిషన్.. నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ