New Year Party invitation | పుణె పబ్ నిర్వాకం.. న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్లో కండోమ్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలకు తెరలేవనుంది. పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకడానికి అంతా సిద్ధమవుతున్నారు. మంగళ, బుధవారాల్లో జోరుగా పార్టీలు చేసుకునేందుకు యువత సన్నద్ధమవుతున్నది. ఈవెంట్లు, పార్టీల పేరుతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు పబ్‌లు, క్లబ్‌లు కూడా రెడీ అయ్యాయి.
పుణె: మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలకు తెరలేవనుంది. పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకడానికి అంతా సిద్ధమవుతున్నారు. మంగళ, బుధవారాల్లో జోరుగా పార్టీలు చేసుకునేందుకు యువత సన్నద్ధమవుతున్నది. ఈవెంట్లు, పార్టీల పేరుతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు పబ్‌లు, క్లబ్‌లు కూడా రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి ఓ పబ్ ఇచ్చిన ఆహ్వానం (New Year Party invitation) ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. నూతన సంవత్సర వేడుకల ఇన్విటేషన్‌తోపాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపించింది. అది చూసినవారంతా షాక్ అవుతున్నారు.

మహారాష్ట్రలోని పుణెలో ఉన్న హై స్పిరిట్స్ పబ్ న్యూ ఇయర్ వేడుల్లో భాగంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో గెస్టులకు దీనికి సంబంధించిన ఇన్విటేషన్‌తోపాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపించింది. ఈ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్ మేనేజ్మెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
పబ్, నైట్ లైఫ్‌కు తాము వ్యతిరేకం కాదని యూత్ కాంగ్రెస్ నేత అక్షయ్ తెలిపారు. అయితే యూత్‌ను తమ పబ్‌కు వచ్చేలా ఇలాంటి దిగజారుడు పనులు, చెత్త మార్కెటింగ్ వ్యూహాలు సరికావని మండిపడ్డారు. సదరు పబ్‌పై వెంటనే పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇన్విటేషన్ కార్డును అందుకున్న పలువురిని పిలిచి విచారించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

