ISRO | జనవరిలో ఇస్రో 100వ మిషన్.. నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ఎన్వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్ చేసిన పలు మిషన్‌లో జీఎస్ఎల్వీ మిషన్ ఒకటని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ఎన్వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్ చేసిన పలు మిషన్‌లో జీఎస్ఎల్వీ మిషన్ ఒకటని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సోమ్‌నాథ్ ఈ ప్రకటన చేశారు.
మే 29, 2023న జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ఎన్ఎస్వీ-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని సోమ్‌నాథ్ పేర్కొన్నారు. ఎన్వీఎస్-04 ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్ ఉంటుందన్నారు. ఇది ఇండియన్ కాన్స్టెలేషన్ (NAVIC)తో నావిగేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కవరేజ్ కోసం ఎల్1 బ్యాండ్ సిగ్నల్ కలిగి ఉంటుందన్నారు. ఎన్వీఎస్-2 మిషన్‌తో మరింత పురోగతి సాధించాలని భావిస్తున్నామన్నారు. అధునాతన ఫీచర్స్‌తో నావిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
చంద్రయాన్-4పై కీలక సమాచారం..
ఇస్రో చీఫ్ ఈ సందర్భంగా చంద్రయాన్-4 మిషన్‌పై కీలక సమాచారాన్ని వెల్లడించారు. మిషన్‌లో వివిధ మాడ్యూల్స్ ఉంటాయని.. వేర్వేరు సమయాల్లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు వేర్వేరు మాడ్యూల్స్‌లో ఒకేసారి కలుపనున్నట్లు తెలిపారు. ఈ మాడ్యూల్స్ కక్షలోకి చేరుకోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాత భూమి కక్ష్య, చంద్రుడి కక్ష్యలో రెండింటిలోనూ డాక్ చేయాల్సి ఉంటుందన్నారు. చంద్రుడిపై దిగి విజయవంతంగా తిరిగి రావడమే చంద్రయాన్-4 లక్ష్యమని సోమ్‌నాథ్ స్పష్టం చేశారు.
స్పాడెక్స్ మిషన్‌లో పంపిన రెండు ఉపగ్రహాల డాకింగ్ జనవరి 7 వరకు పూర్తవుతుందన్నారు. చంద్రయాన్-4కి ఇది పరీక్ష లాంటిదన్నారు. డాకింగ్ ప్రక్రియ సోమవారం మొదలవుతుందని.. ఇందులో అనేక ప్రక్రియలుంటాయన్న ఆయన.. డాకింగ్ తుది ప్రక్రియ జనవరి 7వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఇస్రోకి స్పాడెక్స్ మిషన్ కీలక మైలురాయి అని ఇస్రో చైర్మన్ తెలిపారు. వచ్చే ఏడాది 100వ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

