బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ

హైదరాబాద్: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌కు చెందిన యాంటీ షిప్ వర్షన్‌ను ఇవాళ భారత్ పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ క్షిపణి పరీక్ష జరిగినట్లు అధికారులు చెప్పారు. భారత్ ఇటీవల వరుసగా బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇవాళ కూడా ఈ ట్రయల్ జరిగింది. గత నెల 24వ తేదీన కూడా భారత్ .. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఆ పరీక్ష కూడా జరిగింది. మరో దీవిలో ఉన్న టార్గెట్‌ను ఆ మిస్సైల్ ధ్వంసం చేసింది. ల్యాండ్ అటాక్ వర్షన్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిని ఆ రోజున పరీక్షించారు. భారతీయ ఆర్మీ నేతృత్వంలో ఆ పరీక్ష జరిగింది. ఇవాళ మాత్రం భారతీయ నేవీ ఆ మిస్సైల్‌ను పరీక్షించింది. ఐఎన్ఎస్ రణ్విజయ్ నుంచి బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైల్‌ను పరీక్షించారు. బంగాళాఖాతంలో అతి సుదీర్ఘ దూరంలో ఉన్న టార్గెట్‌ను ఆ క్షిపణి ధ్వంసం చేసింది.