దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదవగా, 4120 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,37,03,665కు చేరగా, మృతులు 2,58,317కు చేరారు. మరో 1,97,34,823 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 37,10,525 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17,72,14,256 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
ఇక డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి భారత్‌లో నమోదైన కేసులు.. ప్రపంచం మొత్తం కేసుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయని పేర్కొన్నది. అంటే ఈ మూడు రోజుల్లో భారత్‌లో నమోదైన కేసుల కంటే అన్ని దేశాల్లో రికార్డయిన కేసులే తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. మరణాలు కూడా మూడో వంతు ఇండియాలోనే నమోదయ్యాయని తెలిపింది. దీంతో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా సంభవించిన దేశాల్లో భారత్ అగ్రభాగంలో నిలిచిందని పేర్కొంది.
గత 24 గంటల్లో బ్రెజిల్లో 25,200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ఇండియా తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలో 22,261, ఫ్రాన్స్, ఇరాన్లో 18 వేల చొప్పున నమోదయ్యాయి. ఈ దేశాల్లో కంటే భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు నమోదవడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
లాక్డౌన్: పోస్టాఫీస్ పని వేళల్లో మార్పులు
భారత్‌లో వైరస్ వ్యాప్తికి మతపరమైన, రాజకీయ సమావేశాలే కారణం: డబ్ల్యూహెచ్ఓ
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
దయచేసి మాస్కు ధరించండి.. చనిపోయే ముందు ఓ వైద్యురాలి ఆవేదన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

