Coronavirus | కొత్తగా 341 కరోనా కేసులు.. మూడు మరణాలు.. అత్యధికంగా కేరళలోనే
Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.
Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో సోమవారం 260 కేసులు నమోదు కాగా, మంగళవారం 142 కేసులు బయటపడ్డాయి. ఆ సంఖ్య బుధవారంనాటికి 300 మార్క్‌ను దాటింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కి పెరిగింది.
మరోవైపు కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు. అందులో ఒకటి కర్ణాటకలో కాగా, రెండు మరణాలు కేరళలో నమోదయ్యాయి. దీంతో కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఈ మూడేళ్లలో మహమ్మారికి 3,33,321 మంది బలయ్యారు. కరోనా నుంచి 4.44 కోట్ల మంది రికవరీ కాగా, రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంకాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read..
Heavy Rains | 47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత వర్షంతో అతలాకుతలమైన తమిళనాడు.. 10 మంది మృతి
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేశ్
DGP Ravi Gupta | డ్రగ్స్ పెడ్లర్లకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వార్నింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

