AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేశ్
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ నాయకులకు గుబులు పుడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కసరత్తు చేస్తుండటంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఎవరికి సీటు ఇస్తారో.. ఎవరికి ఇవ్వారననే ఆందోళన పెరిగిపోతుంది.
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ నాయకులకు గుబులు పుడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కసరత్తు చేస్తుండటంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఎవరికి సీటు ఇస్తారో.. ఎవరికి ఇవ్వారననే ఆందోళన పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిన్న ఏపీ పర్యాటక మంత్రి రోజా సెల్వమణి స్పందించగా.. తాజాగా మంత్రి జోగి రమేశ్ కూడా రియాక్ట్ అయ్యారు. జోగి రమేశ్ సమర్థుడైతేనే టికెట్ ఇస్తారని.. లేదంటే ఇవ్వరని పేర్కొన్నారు.
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. గీత దాటనని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా.. మైలవరం వెళ్లమంటే వెళ్తానని పేర్కొన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి రోజా కూడా దాదాపు ఇదేవిధంగా స్పందించారు. నగరి నియోజకవర్గం నుంచి సీటు రావడం లేదన్న వ్యాఖ్యలపై స్పందించారు. ‘తనకు సీటు ఇవ్వకపోయిన ఇబ్బందేమి లేదు. తాను జగనన్న సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పా. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదని’ పేర్కొన్నారు. తనకు సీటు ఉందో లేదో నన్న విషయం కార్యకర్తలకు, నాయకులకు తెలుసునని వెల్లడించారు. తనకు సీటు లేదని మీరు(మీడియా) ఆనందపడినా ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

