Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ (Indian Army) తాజాగా విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని (Pakistani Mirage Jet) కూల్చివేసినట్లు ఈ వీడియో ద్వారా భారత్ స్పష్టం చేసింది. ‘గగనతలంలో శత్రువును ధ్వంసం చెయ్’ అన్న క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో పాక్ మిరాజ్ శిథిలాలను కూడా చూపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025
మరోవైపు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఇవాళ త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. మూడు దళాలకు చెందిన డీజీఎంవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫైట్ చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదులను టార్గెట్ చేసిన సమయంలో పాకిస్థాన్ మిలిటరీ జోక్యం చేసుకున్నదని, ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యతిరేకించిందని, అందుకే తాము రెస్పాండ్ అయినట్లు వారు వివరించారు.
Also Read..
India-Pakistan | భారత్-పాక్ మధ్య కీలక చర్చలు వాయిదా..!
Operation Sindoor: క్రికెట్ స్టోరీ చెప్పిన డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. వీడియో