India-Pakistan |భారత్, పాకిస్థాన్ (India – Pakistan) మధ్య జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డట్లు తెలిసింది. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో జరగాల్సిన ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు ( DGMO level truce talks) సాయంత్రం 5 గంటలకు వాయిదా పడినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు.
India-Pakistan Director General of Military Operations (DGMO) talks scheduled this evening: Sources
— ANI (@ANI) May 12, 2025
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈనెల 10న ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఈ నెల 12న ఇరుదేశాల డీజీఎంవోలు మరోసారి చర్చలు జరపున్నట్లు అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంవోలు ఇవాళ ఉదయం 12 గంటలకు హాట్లైన్లో చర్చలు జరపాలని ముందుగా నిర్ణయించారు. అయితే, చివరి నిమిషంలో ఈ చర్చలు వాయిదా పడినట్లు సమాచారం. ఇక ఈ చర్చల్లో భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ తరఫున డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొననున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, పీవోకే అంశం, కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
PM Modi | భారత్-పాక్ చర్చల వేళ.. అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ
ISRO | దేశ భద్రత కోసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయి : ఇస్రో చైర్మన్
Airports Reopen | సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి.. దేశంలో తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు