PM Modi | భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల డీజీఎంవోలు (DGMOs) హాట్లైన్లో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval), సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని తన నివాసంలో సోమవారం ఉదయం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈరోజు రక్షణ ఉన్నతాధికారులతో ప్రధాని నిర్వహించిన రెండో కీలక భేటీ ఇది. ఇలా వరుస భేటీలతో పాక్‌పై తదుపరి చర్యలు ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read..
ISRO | దేశ భద్రత కోసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయి : ఇస్రో చైర్మన్
India-Pakistan | హాట్లైన్లో భారత్-పాక్ మధ్య చర్చలు
Airports Reopen | సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి.. దేశంలో తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు