ISRO | భారత పౌరుల భద్రత కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 10 ఉపగ్రహాలు (10 satellites) నిరంతరం పనిచేస్తున్నాయని (continuously monitoring for security) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ (V Narayanan) తెలిపారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశ భద్రత కోసం ఇస్రో చేస్తున్న కృషి గురించి ఆయన వివరించారు.
ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్అగ్రికల్చర్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ కీలక అంశాలను వెల్లడించారు. పాకిస్థాన్‌తో (Pakistan) తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దు (Borders)లు, తీరప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, రక్షించడానికి 10 భారతీయ ఉపగ్రహాలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
‘మన పొరుగుదేశాల గురించి మీ అందరికీ తెలుసు. అందుకే మన దేశ భద్రత కోసం ఉపగ్రహాలను వినియోగించాల్సిందే. మనకు దాదాపు 7000 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. కనుక ఆ తీర ప్రాంతాలను, ప్రధానంగా మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఇందుకోసం శాటిలైట్, డ్రోన్ టెక్నాలజీ తప్పనిసరి. అవి లేకుండా మన భూభాగాన్ని కాపాడుకోవడం కష్టం’ అని వి.నారాయణన్ పేర్కొన్నారు. ఈ పది ఉపగ్రహాలు సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత, సముద్ర జలాల పరిరక్షణ వంటి అంశాలపై నిరంతర సమాచారాన్ని అందిస్తాయని, తద్వారా సత్వర చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన వివరించారు.
అంతేకాదు భద్రతాపరమైన అంశాలతో పాటు ఇస్రో ఉపగ్రహాలు వ్యవసాయం, టెలీ-ఎడ్యుకేషన్, టెలీ-మెడిసిన్, వాతావరణ అంచనాలు, పర్యావరణ పర్యవేక్షణ, ఆహార భద్రత వంటి అనేక పౌర సేవల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో ఉపగ్రహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. గతంలో విపత్తుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతే నేడు ఆ పరిస్థితి లేదని గుర్తుచేశారు.
అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ఘన విజయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రయాన్-1 ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న తొలి దేశంగా భారత్ నిలిచిందని నారాయణన్ గర్వంగా ప్రకటించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను భారత్ విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు.
Also Read..
India-Pakistan | హాట్లైన్లో భారత్-పాక్ మధ్య చర్చలు
Airports Reopen | సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి.. దేశంలో తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు