India-Pakistan | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చలు జరుపుతున్నారు (military level talks). ఈ చర్చల్లో భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ తరఫున డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, పీవోకే అంశం, కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈనెల 10న ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఈ నెల 12న ఇరుదేశాల డీజీఎంవోలు మరోసారి చర్చలు జరపున్నట్లు అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంవోలు హాట్లైన్లో చర్చలు జరుపుతున్నారు.
ఈ సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్తో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
Also Read..
Airports Reopen | సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి.. దేశంలో తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
DGMO | మధ్యాహ్నం 2.30 గంటలకు త్రివిధ దళాల ప్రెస్మీట్