Operation Sindoor: క్రికెట్ స్టోరీ చెప్పిన డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. వీడియో
Operation Sindoor: మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆ అంశాన్ని ఆయన వివరిస్తూ ఓ క్రికెట్ సంఘటన గుర్తు చేశారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి ఇవాళ డీజీఎంవోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ ఓ క్రికెట్ స్టోరీ చెప్పారు. మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమన్నారు. ఆ అంశాన్ని ఆయన వివరిస్తూ ఓ క్రికెట్ సంఘటన గుర్తు చేశారు. అయితే ఇవాళ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారని, అతను తనకు ఫెవరేట్ క్రికెటర్ అని తెలిపారు.
ఇక 1970 దశకంలో యాషెస్ సిరీస్ ఒకటి జరిగిందని, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ముచ్చమటలు పట్టించారన్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీలు కూల్చేశారన్నారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఓ నానుడి వచ్చిందని, యాషెస్ టు యాసెస్, డస్ట్ టు డస్ట్, ఇఫ్ థామో డోంట్ గెట్ యా, లిల్లీ మస్ట్ అన్న ప్రావర్బ్ పుట్టిందన్నారు.
అంటే ఒకవేళ జెఫ్ థాంప్సన్‌ను తప్పించుకున్నా.. డెన్నిస్ లిల్లీకి బ్యాటర్ చిక్కాల్సిందే అన్న రీతిలో ఆ స్టేట్మెంట్ ఉంది. ఈ అంశాన్ని పరిశీలిస్తే, నేను చెప్పేది మీకు అర్థం అవుతుందని, ఒకవేళ అన్ని పొరలు దాటినా.. ఈ వ్యవస్థలోని ఏదో ఒక దగ్గర గట్టి ప్రతిఘటన తప్పదని పాకిస్థాన్‌కు తనదైన స్టయిల్లో ఘాయ్ హెచ్చరించారు.
#WATCH | Delhi | DGMO Lieutenant General Rajiv Ghai says, “Targetting our airfields and logistics is way too tough… I saw that Virat Kohli has just retired from test cricket; he is one of my favourites. In the 1970s, during the Ashes between Australia and England, two… pic.twitter.com/B3egs6IeOA
— ANI (@ANI) May 12, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

