న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫైట్ చేశామని, కానీ పాకిస్థాన్ మిలిటరీ ఆ ఉగ్రవాదులకు సపోర్టు ఇచ్చిందని, దీంతో ఉద్రిక్తతలు ఉదృతమైనట్లు ఎయిర్ మార్షల్ ఏకే భార్తి తెలిపారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి ఇవాళ త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. మూడు దళాలకు చెందిన డీజీఎంవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదులను టార్గెట్ చేసిన సమయంలో పాకిస్థాన్ మిలిటరీ జోక్యం చేసుకున్నదని, ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యతిరేకించిందని, అందుకే తాము రెస్పాండ్ అయినట్లు ఆయన తెలిపారు.
#WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD
— ANI (@ANI) May 12, 2025
పాకిస్థాన్‌లో జరిగిన నష్టాలకు ఆ దేశ ఆర్మీదే బాధ్యత అని ఆయన అన్నారు. తాము కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే పోరాడినట్లు చెప్పారు. భారతీయ వైమానిక రక్షణ వ్యవస్థ.. పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసినట్లు భార్తి తెలిపారు. గత దశాబ్ధ కాలంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బలంగా తయారైందన్నారు.
భారీ సంఖ్యలో డ్రోన్లు, ఏరియల్ వెహికిల్స్‌తో పాకిస్థాన్ దాడి చేసిందని, స్వదేశీయంగా అభివృద్ధి చేసిదన యూఏఎస్ సిస్టమ్స్, శిక్షణ పొందిన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిబ్బంది తిప్పికొట్టినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఇండియా టార్గెట్ చేసిన కేంద్రాల ఫోటోలను ఎయిర్ మార్షల్ ఏకే భార్తి ప్రదర్శించారు.
మన మిలిటరీ బేస్‌లు, మన వ్యవస్థలన్నీ పూర్తిగా ఆపరేషన్‌లో ఉన్నాయని, భవిష్యత్తులో ఎటువంటి మిషన్ అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భార్తి తెలిపారు. మీడియా సమావేశంలో చైనాకు చెందిన పీఎల్-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ శకలాలను చూపించారు. ఇండియాపై అటాక్ చేసిన సమయంలో పాకిస్థాన్ ఆ మిస్సైల్‌ను వాడినట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన వైఐహెచ్ే, సోన్గార్ డ్రోన్ల శకలాలను కూడా ఇండియా ప్రదర్శించింది.
#WATCH | Delhi | The Indian military shows the debris of a likely PL-15 air-to-air missile, which is of Chinese origin and was used by Pakistan during the attack on India.
The wreckage of the Turkish-origin YIHA and Songar drones that were shot down by India has also been shown pic.twitter.com/kWIaIqnfkQ
— ANI (@ANI) May 12, 2025