INDIA bloc MPs | ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ కాకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆ రాష్ట్రంలో కాకుండా దేశ పార్లమెంటులో హోరాహోరీగా సాగుతున్నది. బీహార్లో సర్ (Special Intensive Revision) పేరిట ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు (INDIA bloc MPs) పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. గత నాలుగు రోజులుగా పార్లమెంట్ ఆవరణలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా పార్లమెంట్ బయట ఇండియా కూటమి ఎంపీలు (INDIA bloc MPs) బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
#WATCH | Delhi: INDIA bloc MPs protest and raise slogans against the Special Intensive Revision of electoral rolls (SIR) being carried out in Bihar pic.twitter.com/eP4WkUAaZx
— ANI (@ANI) July 25, 2025
నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తాం?: ఈసీ
బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్షపై పార్లమెంటు లోపల, వెలుపల వ్యక్తమవుతున్న నిరసనలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గురువారం స్పందించారు. ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామని ప్రశ్నించారు. మృతుల పేరు మీద, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేరు మీద నకిలీ ఓట్లు వేసేవారికి, రెండు చోట్ల ఓట్లు వేసేవారికి, ఫేక్ ఓటర్లు లేదా ఫారిన్ ఓటర్లు నకిలీ ఓట్లు వేయడానికి ఎలా అనుమతిస్తామన్నారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాహుల్కు ఈసీ తెలిపింది.
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర.. 21 రోజుల్లో 3.5 లక్షల మంది దర్శనం
PM Modi | మాల్దీవ్స్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన మొయిజు
Robbery | ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చి బంగారం దుకాణంలో చోరీ.. షాకింగ్ వీడియో