మహబూబ్ నగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను( KCR Birthday ) ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ( Mahabubnagar district ) మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ..

నాగర్ కర్నూల్( Nagar Kurnool ) జిల్లా ఆసుపత్రిలో బీఆర్ఎస్ శ్రేణులు రోగులకు బ్రేడ్ ,పండ్లు పంపిణీ చేశారు. మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పట్టణ కౌన్సిలర్స్ తిమ్మాజీపేట పాండు, కొత్త గంగాధర్, అర్జునయ్య, జయప్ర కాష్ చారి ,జయలక్ష్మి నగేష్, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, పార్టీ నాయకులు అర్థం రవి, భాస్కర్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, మాధవ రెడ్డి కేశవులు గౌడ్, మన్యపు రెడ్డి, రామకృష్ణ రెడ్డి, ఆనంద్ గౌడ్, యోగానంద రెడ్డి, నర్సింహ రెడ్డి,రమేష్ గౌడ్,బాబు రావు,కృష్ణ రెడ్డి, షఫీఖాన్, అమరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కిషోర్, వెంకటయ్య, రమణ , ప్రసాద్, శివ సంతు,పలువురు పాల్గొన్నారు
జోగులాంబ గద్వాల జిల్లాలో
జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో గద్వాల ( Gadwal ) నియోజకవర్గ నాయకులు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అంతకుముందు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
