Robbery | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ (Ghaziabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ బంగారం దుకాణం (Jewellery Shop)లో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బ్లింకిట్, స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో (Dressed As Food Delivery Agents ) హెల్మెట్లు ధరించిన వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉన్న మాన్సి జ్యువెలర్స్లోకి చొరబడ్డారు. అక్కడ సిబ్బందిని బెదిరించి.. దుకాణంలోని డిస్ప్లేలో ఉన్న ఆభరణాలను దోచుకున్నారు. వాటన్నింటినీ తమ బ్యాగుల్లోకి నింపుకుని అక్కడ నుంచి ఉడాయించారు. దుకాణం నుంచి దాదాపు 20 కిలోల వెండి, 125 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని తెలిపారు. ఐదారు నిమిషాల్లోనే మొత్తం ఊడ్చుకెళ్లినట్లు పేర్కొన్నారు. తాను పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పారు. 15-20 నిమిషాల్లో పోలీసులు వచ్చారని.. అయితే అప్పటికే దొంగలు పారిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Uttar Pradesh | Thieves disguised as delivery boys execute a robbery at a jewellery store in Ghaziabad. CCTV visuals of the crime. (24.07)
Visuals Source: Police pic.twitter.com/nPTgnWyIYV
— ANI (@ANI) July 25, 2025
Also Read..
Intel layoffs | ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఇంటెల్.. త్వరలో 25 వేల మంది తొలగింపు..!
School Building Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం.. నలుగురు చిన్నారులు మృతి