జైపూర్: రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసారిగా కూలిపింది. నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా, మరో 40 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సంబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు.
కాగా, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంపై గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో వర్షం కారణంగా బిల్డింగ్ గోడ కూలిపోయింది. దీంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.
Jhalawar, Rajasthan | 3-4 students die as the roof of Piplodi Primary School in Jhalawar collapses. Many students injured. Upon receiving the information, Jhalawar Collector and SP Amit Kumar Budania left for the spot: SP Jhalawar Amit Kumar
— ANI (@ANI) July 25, 2025