Intel layoffs | ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఇంటెల్.. త్వరలో 25 వేల మంది తొలగింపు..!
Intel layoffs | ప్రముఖ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఇంటెల్ తాజాగా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
Intel layoffs | ప్రముఖ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చిలో ఇంటెల్ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ (Lip-Bu Tan) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో సంస్థ భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఇంటెల్ తాజాగా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. సంస్థ త్వరలోనే 25,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది. ప్రస్తుతం 1,08,900 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ.. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 75,000కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15 శాతం అంటే సుమారు 15,000 ఉద్యోగాలను తగ్గించింది. గతేడాది 15 వేలకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఉద్యోగ కోతలు లేఆఫ్‌లు, సహజ విరమణలు, ఇతర చర్యల ద్వారా జరుగుతాయని నివేదిక వెల్లడించింది.
2025 రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఇంటెల్ ఉద్యోగుల తొలగింపును ధృవీకరించింది. పునర్నిర్మాణ ఖర్చులతో సహా కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 12.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో సంస్థ ఆదాయం 12.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తోంది.
ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను ప్రస్తావించారు. గత కొన్ని నెలలుగా పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నాయన్నారు. సంస్థను క్రమబద్ధీకరించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రతి స్థాయిలో జవాబుదారీతనం పెంచడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read..
President’s Rule | మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు పొడిగింపు..
PM Modi | ప్రధానిగా 4,078 రోజులు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించిన మోదీ..
School Building Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం.. నలుగురు చిన్నారులు మృతి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

