INDIA Bloc MPs | బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీనిపై వారం రోజులుగా పార్లమెంట్లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు (INDIA Bloc MPs) ఆందోళన (protest) చేపడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన బుధవారం కూడా ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.
#WATCH | Delhi | INDIA Bloc MPs protest against the Special Intensive Revision (SIR) and the “arrest of labourers in BJP-ruled states” pic.twitter.com/mv7XsV8Y8y
— ANI (@ANI) July 30, 2025
బుధవారం ఉదయం పార్లమెంట్ బయట ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. SIRను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. దీంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల అరెస్ట్‌లపై కూడా నిరసన తెలిపారు.
#WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson and MP Sonia Gandhi joins the INDIA Bloc protest against the Special Intensive Revision (SIR) and the “arrest of labourers in BJP-ruled states” outside the Parliament pic.twitter.com/KkgZDDANDz
— ANI (@ANI) July 30, 2025
Also Read..
Amarnath Yatra | జమ్ము కశ్మీర్లో భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Tsunami warning | భారీ భూకంపంతో భారత్‌కు సునామీ ముప్పు..? ఇన్కాయిస్ ఏమన్నదంటే..?
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం