Tsunami warning | రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతోపాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది (Tsunami warning).
ఈ క్రమంలో భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) స్పందించింది. భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పూ లేదని వెల్లడించింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పూ లేదని తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో (INCOIS) ట్వీట్ పెట్టింది.
ఈ భూకంపం తర్వాత రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకింది. అమెరికాలోనూ (America) హెచ్చరికలు ఇచ్చారు. హవాయి (Hawaii) ద్వీపంలో అప్రమత్తత ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Also Read..
Tsunami warnings: మరికొన్ని గంటల్లో హవాయి తీరానికి సునామీ.. బీచ్‌ల నుంచి వెళ్లిపోతున్న జనం
Strongest Earthquake: అత్యంత శక్తివంతమైన భూకంపం.. చరిత్రలో ఆరోసారి రికార్డు