Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kadhmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. పూంచ్ (Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు.
Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kadhmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. పూంచ్ (Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హత మార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.
పూంచ్ సెక్టార్‌లోని జెన్ ప్రాంతంలో కంచె వెంబడి బుధవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
కాగా, సోమవారం ఉదయం దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.
Also Read..
ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశాలు.. డీకే దూరం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

