శ్రీహరికోట: ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న ‘నిసార్’ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా దీనిని బుధవారం అంతరిక్షంలోకి పంపుతున్నట్టు ఇస్రో వెల్లడించింది. భూ ఉపరితలానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించే ‘నిసార్’, ప్రతి 12 రోజులకోసారి డాటాను అందజేస్తుంది.
ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల అధ్యయనానికి ఈ డాటాను ఉపయోగిస్తారు.