IND vs ENG T20I : ట్వీంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ (T20I cricket) లో భారత బౌలర్ (Indian bowler) అర్షదీప్ సింగ్ (Arshadeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా (Kolkata) లోని ఈడెన్ గార్డెన్ (Eden garden) లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్ ఈ ఫీట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. యజువేంద్ర చాహల్ (Yazvendra Chahal) రికార్డును బద్దలు కొట్టాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రెండో వికెట్ తీయడం ద్వారా మొత్తం 97 వికెట్లతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా అర్షదీప్ నిలిచాడు. ఇప్పటివరకు హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న యజువేంద్ర చాహల్ (96 వికెట్లు) రికార్డును అర్షదీప్ బద్దలు కొట్టాడు. తన 61వ టీ20 మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. అర్షదీప్, యజువేంద్ర చాహల్ తర్వాత వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో భువనేశ్వర్ కుమార్ (90), జస్ప్రీత్ బుమ్రా (89), హార్దీక్ పాండ్యా (89) ఉన్నారు.
Karnataka accidents | మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కర్ణాటక సీఎం
IEDs neutralise | ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మందుపాతరలు నిర్వీర్యం.. Video
Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది తగ్గిన పోస్టులు
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు