Karnataka accidents : ఇవాళ (బుధవారం) ఉదయం కర్ణాటక (Karnataka) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో (Road accidents లో) మృతిచెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddha Ramaiah) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయాన్నే ఉత్తర కన్నడ, రాయ్‌చూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఉత్తర కన్నడ ప్రమాదంలో 11 మంది, రాయ్‌చూర్ ప్రమాదంలో నలుగురు మరణించారు.
ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి సరైన వైద్య సదుపాయం అందేలా చూడాలని సీఎం సిద్ధరామయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా కర్ణాటకలో బుధవారం ఉదయం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర సంతలో పండ్డు విక్రయించేందుకు కొంతమంది ట్రక్కులో వెళ్తుండగా ఆ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. సావనూర్ – హుబ్బళి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూర్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
IEDs neutralise | ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మందుపాతరలు నిర్వీర్యం.. Video
Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది తగ్గిన పోస్టులు
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Dog revenge | ఢీకొట్టిన కారు యజమానిపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. Video viral