ఆదివారం 24 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:27:24

దేశంలో పెరిగిన హెర్డ్‌ ఇమ్యూనిటీ!

దేశంలో పెరిగిన హెర్డ్‌ ఇమ్యూనిటీ!

న్యూఢిల్లీ, జనవరి 4: దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటను కలిగిస్తున్నది. స్థానికంగా ఏర్పడిన హెర్డ్‌ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి), యువ జనాభా కారణంగానే వైరస్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 65 శాతం (87 కోట్లు) జనాభా వయస్సు 35 ఏండ్ల లోపువారేనని, వాళ్లలో సహజంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్లనే వైరస్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు అంటువ్యాధుల పరిశోధకుడు రామనన్‌ లక్ష్మీనారాయణ్‌ పేర్కొన్నారు.


logo