Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Attack) సంబంధించి ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ పర్యాటకుడు (Tourist) జిప్‌లైన్ ( Zipline)పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
listen first 5 seconds of the video , the local guy zipline helper
1. listened gunshots from the ground
2. chanted allahuakbar 3 times
3. released the personbut pls saaar don’t het lokals saaaar they’re helpful saar, they’ll are mdrchds.
— Keshu (@keshuu_17) April 28, 2025
జిప్‌లైన్‌పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా.. కింద ఉన్న పర్యాటకులు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న దృశ్యాలు అందులో నిక్షిప్తమయ్యాయి. అంతేకాదు తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయి. ఈ రైడ్‌కు ముందు జిప్‌లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘అల్లాహూ అక్బర్’ అంటూ మూడు సార్లు జిప్‌లైన్ ఆపరేటర్ అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని విచారించేందుకు ఎన్ఐఏ సమన్లు జారిచేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం కశ్మీర్ లోయలో వేట కొనసాగుతోంది. గత వారం రోజులుగా కశ్మీర్ లోయను సైన్యం జల్లెడపడుతోంది. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదులు చైనా మెసేజింగ్ యాప్‌లను వాడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ యాప్‌ల సాయంతోనే ఉగ్రవాదులు భారత సరిహద్దుకు ఆవల ఉన్నవారితో సమచారాన్ని పంచుకున్నాయని, ఆదేశాలు అందుకున్నాయని వివరించాయి. ఈ యాప్‌లను 2020లో గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ నిషేధించిందని పేర్కొన్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇండియా నిషేధం విధించిన చైనా మెసేజింగ్ యాప్స్‌లో వీచాట్, క్యూక్యూ ఇంటర్నేషనల్ వంటివి ఉన్నాయి.
Also Read..
Terror Attacks | ఉగ్రదాడితో అప్రమత్తమైన ప్రభుత్వం.. కశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత
Mumbai | ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. క్రోమా షోరూమ్‌లో ఎగసిపడిన మంటలు