Indian Railway | న్యూఢిల్లీ : కన్ఫర్మ్డ్ టికెట్లు గల ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ముఖ్యమైన చర్యలను ప్రకటించింది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులను స్లీపర్, ఏసీ బోగీల్లోకి అనుమతించేది లేదని తెలిపింది. వారు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించవచ్చునని చెప్పింది. వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని వివరించింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించే వారిని జనరల్ కంపార్ట్‌మెంట్‌కు తరలించేందుకు లేదా జరిమానా విధించేందుకు టీటీఈకి అధికారం ఉందని చెప్పింది. ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారి టికెట్లు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే, రైలు బయల్దేరే ముందు ఆ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. కౌంటర్లలో టికెట్లు కొన్నవారు స్లీపర్, ఏసీ బోగీల్లో ఎక్కి, ప్రయాణిస్తున్నారు.