Terror Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదుల కోసం ఐదు రోజులుగా వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.
పెహల్గామ్ ఉగ్రదాడిపై ఆగ్రహంతో ఉన్న సైన్యం.. కశ్మీర్లోని ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంతో రగిలిపోతున్న ముష్కరులు.. పెద్ద ఎత్తున దాడులు, హత్యలకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. కశ్మీర్ లోయలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా.. అందులో 48 ప్రాంతాలను మూసివేసింది (48 tourist destinations closed). ఆ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి ఓపెన్ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
Also Read..
India Pakistan | వరుసగా ఐదో రోజూ.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు
India | సైన్యంపై భారత్ ఖర్చు.. పాక్ కన్నా 9 రెట్లు అధికం
Pahalgam Attack | చిక్కినట్టే చిక్కి.. తప్పించుకున్న పహల్గాం ఉగ్రవాదులు