ముంబై: ముంబైలోని (Mumbai) బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్‌లోని లింక్ స్క్వేర్ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఉన్న క్రోమా షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో రూమ్ మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలు క్రమంగా మాల్ మొత్తానికి విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉదయం 4.11 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని ముంబై ఫైర్ బ్రిగేడ్ వెల్లడించింది. రెండు గంటల్లోనే మంటలు బిల్డింగ్ మొత్తానికి ప్రమాదకర స్థాయికి వ్యాపించాయన్నారు. జీ+3గా ఉన్న షాపింగ్ మాల్ భవనంలో మొదటి మూడు అంతస్తుల్లో క్రోమా షోరూమ్ ఉన్నదని చెప్పారు. దీంతో మంటలు వేగంగా బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయని తెలిపారు. 12 మోటార్ పంపుల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు పోలీసులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని చెప్పారు.
#WATCH | Maharashtra | A fire broke out at a showroom and has now engulfed the entire mall in Mumbai’s Bandra. Fire tenders and NDRF personnel are present at the spot, and operations are underway to douse the fire. No causality has been reported.
More details awaited. pic.twitter.com/DjFeJkS8CN
— ANI (@ANI) April 29, 2025