National
- Dec 03, 2020 , 17:06:58
రేపు కేరళ తీరం దాటనున్న బురేవి తుపాను

తిరువనంతపురం : నైరుతి బంగాళాఖాతంలో బురేవి తుపాను కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున తుపాను కేరళ తీరం దాటే అవకాశం ఉందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. గురువారం నుంచి శనివారం మధ్య కేరళలోని ఏడు జిల్లాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బురేవి తుపాను నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇప్పటికే 2,849 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో చేపల వేటపై నిషేధం విధించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING