అవరోధాలే సోపానాలు
వానరుడే ఈ నరుడు అని రుజువు చేయడానికి కోతి పనులు చేయడం మొదలయ్యింది. మాష్టార్ల అరుపులని అనుకరించడం... అందరినీ నవ్వించడం అలవాటయ్యింది.
వానరుడే ఈ నరుడు అని రుజువు చేయడానికి
కోతి పనులు చేయడం మొదలయ్యింది.
మాష్టార్ల అరుపులని అనుకరించడం… అందరినీ నవ్వించడం అలవాటయ్యింది.
మాష్టార్లని ఇమిటేట్ చేయడంతో ఆగిపోలేదు.
ఏదో ఒక సినిమా చూసి రావడం…
ఎన్.టి.ఆర్. నీ, ఏ.ఎన్.ఆర్. నీ, పద్మనాభం, రాజబాబు, రేలంగీ… లాంటి మహానుభావుల హావభావాలతో పాటు వాచకాన్ని అనుకరించడం… అబ్బుర పరచడం.
యాక్టింగ్‌తో పాటు మోడ్యులేషన్ నీ అనుకరించడం ‘ధ్వన్యనుకరణ’ అంటారని అప్పుడు నాకేం తెలుసు.
మిమిక్రీకి ప్రారంభ దశ… ప్రాచుర్యంలో లేని దశ!
అప్పట్లో మిమిక్రీ అంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారొక్కరే!
ఆ విద్య ఎందుకో నాకు అబ్బింది!
ఎందుకో ఏమిటి… అందుకే… ఇదిగో ఇందుకే…!
నవ్వు పుట్టిన నక్షత్రం… నేను పుట్టిన నక్షత్రం ఒకటే గదా… అందుకే!
కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందంని పిలవండి అనేవారప్పుడు. నేను స్టేజీ ఎక్కి నోరు తెరవకముందే నవ్వులు మొదలయ్యేవి. నోరు తెరిచాక అందరి పొట్ట చెక్కలయ్యేది.
నా మనసు మురిసి ముక్కలయ్యేది!
జీవితంలో పైకి రావాలనుకునేవాళ్ళకు అవరోధాలు అధిరోహించే సోపానాలుగా మారాలి తప్ప ఆటంకాలుగా కనబడకూడదు.
ఎటు వెళ్ళాలో దేవుడు చెప్తాడు.
ఎలా వెళ్లాలో మనమే చూసుకోవాలి.
నేనూ… నా సాంస్కృతిక ప్రయాణం…
తెలుగు… తెలివీ… నా ధ్యేయానికి పునాదులు వేస్తున్న తరుణంలో… సినీ కళామతల్లి సేవలో వున్న ప్రముఖుల పరిచయం జరిగింది!
నేను మిమిక్రీ, మోనో యాక్షన్ చేసే ఫంక్షన్‌కి ప్రముఖ రచయిత, నటులు గొల్లపూడి మారుతీరావుగారూ… డాక్టర్ వివేకానందమూర్తి గారూ చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. ‘పట్టాలు తప్పిన బండి’ అనే నాటకం వేశారు.
వాళ్ళందరి ప్రశంసలూ నాకు దక్కాయి!
నా ప్రదర్శన చూసిన ప్రముఖ నటులు ముక్కామల గారయితే ఏకంగా ఆయన చేతికున్న ఖరీదయిన వాచీ తీసి నా చేతికి తొడిగారు. అదే నా తొలి స్వర్ణ కంకణంగా నేనిప్పటికీ భావిస్తాను.
– ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందమ్’లోని ‘దేవుడు ఛాన్స్ ఇస్తాడు కానీ ఛాయిస్ ఇవ్వడు’ నుంచి…
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: నిరసన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం సరికాదు: సుప్రీంకోర్టు
‘సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి’
Frozen Vegetables | ఫ్రాజెన్ (ఘనీభవించిన) కూరగాయలను వాడవచ్చా.. పోషకాలు ఉంటాయా..?
BRS | ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు : గండి యాదగిరి
Bombay High Court: దియా మీర్జా యాడ్‌ను రిస్టోర్ చేయండి.. బాంబే హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

