D-Mart | న్యూఢిల్లీ, మే 4: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ రూ.563 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ.460 కోట్ల కంటే ఇది 22.39 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.10,594 కోట్ల నుంచి రూ.12,727 కోట్లకు ఎగబాకింది.