HD Revanna | అంతులేని అకృత్యాలు!.. ప్రజ్వల్, రేవణ్ణల లైంగిక దాడులపై బాధితుల ఫిర్యాదులు
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి రేవణ్ణలు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
- ప్రజ్వల్ కుటుంబ పలుకుబడికి భయపడి ఇన్నాళ్లూ మౌనం
- తాజా కేసులతో రేవణ్ణ అరెస్టు.. ప్రజ్వల్‌పై మరో లుకౌట్ నోటీసు
HD Revanna | బెంగళూరు: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి రేవణ్ణలు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకాలం భయంతోనో, అధైర్యంతోనో బయటకురాని బాధితులు ఇప్పుడు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడనాట పెను సంచలనంగా మారాయి.
మూడేండ్లుగా లైంగిక దాడి
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి కన్నడనాట రాజకీయంగా, ఆర్థికంగా మంచి పలుకుబడి ఉంది. దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ ప్రస్తుతం హసన్ ఎంపీగా ఉన్నారు. ఆయన నాన్న రేవణ్ణ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై ఎవరూ ఫిర్యాదు చేయరనే ధైర్యంతో ప్రజ్వల్, ఆయన తండ్రి రేవణ్ణ కొందరు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిపై కేసు నమోదు కాకుండా కోర్టుకు వెళ్లి ప్రజ్వల్ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ ఈసారి మాత్రం వేలాది వీడియోలతో దొరికిపోయారు! ఇవన్నీ ఆయన ఫోనులో చిత్రీకరించినవి కావడం గమనార్హం.
తనపై ప్రజ్వల్ మూడేండ్లుగా అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, మొదటిసారి తుపాకీతో బెదిరించి లైంగిక దాడి చేశాడని.. దాన్ని వీడియో తీసి తనను బ్లాక్మెయిల్ చేశాడని జిల్లా పరిషత్ మాజీ సభ్యురాలు(44) ఒకరు పోలీసుల ఎదుట వాపోయారు. ఆ తర్వాత తనకు తరచూ ఫోన్ చేసి నగ్నంగా మాట్లాడాలని వేధించేవాడని ఆమె వాపోయారు. ప్రజ్వల్ ఇంట్లో పనిచేసిన వంట మనిషి కూడా ప్రజ్వల్ అకృత్యాలను మీడియాకు వెల్లడించింది. అతడు తరచూ తనను లైంగికంగా వేధించేవాడని… తన కూతురికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తన దగ్గరకు వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళలను భయపెట్టో, బెదిరించో లేదా ఇంకేదైనా ఆశ చూపించో ప్రజ్వల్ ఈ నీచమైన పనులకు పాల్పడేవాడని ఆయన ఇంట్లో పనిచేసే వారే చెప్తున్నారు. ప్రజ్వల్ రోజుకు ముగ్గురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారని మాజీ ఎంపీ శివరామే గౌడ ఆరోపించారు. తన ఇంట్లో పని చేసిన మహిళను అపహరించిన కేసులో రేవణ్ణను సిట్ బృందం శనివారం అదుపులోకి తీసుకుంది. మరోవైపు పోలీసులు ప్రజ్వల్‌పై రెండోసారి లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

