ముంబై: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేకు చెందిన విద్యార్థి హాస్టల్ టెర్రస్ పైనుంచి దూకి మరణించాడు. (IIT Bombay student suicide) ఈ నేపథ్యంలో అతడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో మరో విద్యార్థి అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల రోహిత్ సిన్హా ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ కోర్సు నాల్గవ సంవత్సరంలో ఉన్నాడు.
కాగా, శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో హాస్టల్ భవనం టెర్రస్‌పై నుంచి రోహిత్ సిన్హా కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోహిత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే రోహిత్ టెర్రస్‌పై నుంచి కిందకు దూకిన సమయంలో ఆ హాస్టల్లో ఉంటున్న మరో విద్యార్థి ఫోన్లో మాట్లాడుతూ అక్కడ ఉన్నట్లు తమకు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Girl Carries Snake Bitten Mother | పాము కాటేసిన తల్లిని.. వీపుపై ఐదు కిలోమీటర్లు మోసిన బాలిక
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ