ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తిరిగి జత కట్టాలని భావిస్తే ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానిస్తామని అన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సభ్యుడు అంబదాస్ దన్వేకు వీడ్కోలు కార్యక్రమంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. అసెంబ్లీలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే వైపు చూసి ఇలా అన్నారు. ‘చూడండి ఉద్ధవ్ జీ, 2029 వరకు అక్కడికి (ప్రతిపక్షంలోకి) మేం వెళ్లే అవకాశం లేదు. కానీ మీరు ఇక్కడికి (బీజేపీ ప్రభుత్వంలోకి) రావాలనుకుంటే, దానిని పరిగణించండి. అది మీపైనే ఉన్నది. దానిని పరిగణిస్తాం’ అని అన్నారు. దీంతో సభలోని ఎన్డీయే సభ్యులు గోల చేశారు.
కాగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు భారీ ఊహాగానాలకు తెరతీశాయి. పాత మిత్రులైన బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే తిరిగి కలుస్తారా? అన్న చర్చకు దారి తీసింది. సీఎం ఫడ్నవీస్ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలను తాను జోక్‌గా భావిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ఆ తర్వాత అన్నారు.
మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు బీజేపీ చెక్ పెట్టే ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తన వర్గం ఎమ్మెల్యేలపై షిండేకు నియంత్రణ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరాఠీ భాషా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తిరిగి కలుసుకోవడం కూడా బీజేపీని కలవరపరుస్తున్నది. దీంతో ఉద్ధవ్ ఠాక్రేతో తిరిగి జతకట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read:
Opposition ‘Lungi Protest’ | లుంగీ, బనియన్లు ధరించి ప్రతిపక్షాల నిరసన.. ఎందుకంటే?
Mamata Banerjee | బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా: మమతా బెనర్జీ
Woman Strangles Daughter | ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ.. కుమార్తెను చంపి భర్తపై నింద