Sanjay Raut | వారణాసిలో మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పక గెలుస్తుంది.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
Sanjay Raut | ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi) ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి (Varanasi) స్థానం నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తారని అన్నారు.
Sanjay Raut | ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi) ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి (Varanasi) స్థానం నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తారని అన్నారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని చెప్పారు.
‘వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీకి పోటీగా బరిలో దిగితే ప్రియాంక తప్పక గెలుస్తారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar), మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif )తో మన ప్రధాని మోదీ సమావేశమయినప్పుడు.. శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు.
‘పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోగా లేనిది.. శరద్ పవార్, అజిత్ పవార్ ఎందుకు కలుసుకోకూడదు. ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA) సమావేశానికి హాజరుకావాలని చెప్పడానికే అజిత్ పవార్‌ను శరద్ పవార్ కలిసి ఉంటారని నేను భావిస్తున్నాను. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారు’ అని అన్నారు. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా మహారాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Shimla | శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి
Uttarakhand | భారీ వర్షాలకు పేకమేడలా కూలిన కళాశాల.. వీడియో
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. 257 మంది మృతి, రూ.7 వేల కోట్ల నష్టం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

