Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand )ను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉద్ధృతికి నది ఒడ్డున ఉన్న డెహ్రాడూన్ డిఫెన్స్ కళాశాల (Dehradun Defence College) పేకమేడలా కూలిపోయింది. మాల్ దేవతా (Maldevta) జిల్లాలో గల గఢ్వాల్ హిమాలయాల సమీపంలోని నది ఒడ్డున ఉన్న ఈ కళాశాల వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కూలి నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. భవనం కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఉత్తరాఖండ్లో రానున్న 24 గంటల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇందులో డెహ్రాడూన్, నైనిటాల్ జిల్లాలు ఉన్నాయి. మరోవైపు ఈ సీజన్లో భారీ వర్షాలకు కొండ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులతోపాటు.. పలు రోడ్లను అధికారులు మూసివేశారు.
#WATCH | A college building collapsed due to incessant rainfall in Dehradun, Uttarakhand.
(Source: Dehradun Police) https://t.co/i4dpSQs2MH pic.twitter.com/1XhTLTafCi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023
Also Read..
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. 257 మంది మృతి, రూ.7 వేల కోట్ల నష్టం
Leopard | తిరుమలలో మరో చిరుత కలకలం.. అలిపిరి నడక మార్గం పరిసరాల్లో మరో 5 చిరుతల సంచారం
Bedurulanka 2012 | అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయోద్దు.. కార్తికేయ స్ట్రాంగ్ రిప్లయ్