Bedurulanka 2012 | యువనటుడు కార్తికేయ (Karthikeya) తాజాగా నటిస్తున్న చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). ఈ చిత్రానికి యువ దర్శకుడు క్లాక్స్ దర్శకత్వం వహిస్తుండగా.. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ క్యూరియాసిటీ పెంచుతూ.. సినిమాపై అమాంతం అంచనాలు పెంచుతున్నాయి. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బెదురులంక 2012 టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మూవీ ప్రమోషన్స్‌పై మాట్లాడగా.. ఆన్లైన్లోని ఓ సినిమా వెబ్సైట్ ఆ ఇంటర్వ్యూలో లేని మాటలను తప్పుడు థంబ్‌నెల్స్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాజాగా ఈ పోస్టుపై నటుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు.
“దయచేసి ఇంటర్వ్యూ సరిగ్గా చూసి తదనుగుణంగా పోస్ట్ చేయండి.. ఆ థంబ్నెల్స్లో ఉన్న మాటలను నేను చెప్పలేదు.. దయచేసి నటీనటుల ఇమేజ్‌కి లేదా సినిమాకి హాని కలిగించే వాటిని పోస్ట్ చేయవద్దు
ధన్యవాదాలు.” అంటూ కార్తికేయ సోషల్ మీడియాలో రాసుకోచ్చాడు.
Please watch the interview properly and post accordingly..I did not say this..
Please do not post something that damages an actors image or movie’s
vibe.
Thank you🙏 https://t.co/ceMRuOKyzc— Kartikeya (@ActorKartikeya) August 14, 2023
ఇక ఈ సినిమాను ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో సాగే ఈ మూవీలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.