Shimla | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. వర్షం ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఈ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అతలాకుతలమవుతోంది.
ఆ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గత రెండు నెలల్లోనే ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు సుమారు 257 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా సిమ్లా (Shimla)లోని సమ్మర్ హిల్ (Summer Hill) ప్రాంతంలో గల శివాలయంపై కొండచరియలు (landslides) విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర భారతంలో నేటి నుంచి శ్రావణమాసం మొదలైంది. దీంతో శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆ సమయంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి ఆలయంపై పడ్డాయి. ఈ ఘటనలో శివాలయం పూర్తిగా కుప్పకూలింది. శిథిలాల కింద 20 మందికిపైనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో ఆలయంలో సుమారు 50 మందికిపైనే భక్తులు ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు తాజా ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ( Sukhvinder Singh Sukhu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. ‘భారీ వర్షాల కారణంగా సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివ్ మందిర్ (Shiv Mandir)పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆలయం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు. స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాలకు బియాస్ నది నీటిమట్టం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో 21 మంది మరణించినట్లు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నదులు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
#WATCH | Landslide strikes a temple building in Shimla following heavy rainfall in the area, operation underway to rescue stranded persons
(Video source: Police) pic.twitter.com/MVYxIS9gt3
— ANI (@ANI) August 14, 2023
WATCH | Shimla's Summer Hill area hit by landslide; few people feared dead, operation underway to rescue stranded persons
CM Sukhvinder Singh Sukhu and state minister Vikramaditya Singh are on present on the spot pic.twitter.com/sjTLSG3qNB
— ANI (@ANI) August 14, 2023
#WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu on landslide incident in Shimla and devastation due to heavy rainfall in the state
"20-25 people are trapped under debris here (Summer Hill, Shimla). 21 people dead in the last 24 hours in the state. I appeal to people to stay… pic.twitter.com/qvATnkjSVL
— ANI (@ANI) August 14, 2023
Also Read..
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. 257 మంది మృతి, రూ.7 వేల కోట్ల నష్టం
Uttarakhand | భారీ వర్షాలకు పేకమేడలా కూలిన కళాశాల.. వీడియో
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి.. ఏడుగురు మృతి