INDW vs SLW : పొట్టి సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన షఫాలీ వర్మ(5) చివరి మ్యాచ్‌లో విఫలమైంది. త్రివేండ్రంలో జరుగుతున్న ఐదో టీ20లో ఈ డాషింగ్ ఓపెనర్ వెనుదిరిగింది. ఈమ్యాచ్‌తో పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన కమలిని(12) రెండు ఫోర్లతో అలరించినా.. కవిశ దిల్హరి బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యింది. దాంతో.. పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.
నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో స్మృతిమంధానకు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. పవర్ ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. హ్యాట్రిక్ అర్ధ శతకాలతో శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్న షఫాలీ వర్మ(5) పెద్ద షాట్‌కు యత్నించి ఔటయ్యింది. అరంగేట్రం బ్యాటర్ కమలిని(12) ఆత్మవిశ్వాసంతోనే కనిపించినా.. ఎల్బీగా వికెట్ ఇచ్చేసింది.
INTENT EARLY ON 👊
First boundary of G. Kamalini’s international career 🙌#INDvSL, 5th T20I | LIVE NOW 👉 https://t.co/xsHHQtPARo pic.twitter.com/iGDnczuTlg
— Star Sports (@StarSportsIndia) December 30, 2025
27 పరుగులకే రెండు వికెట్లు పడిన వేళ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(10 నాటౌట్), హర్లీన్ డియోల్(13)తో ఇన్నింగ్స్ నిర్మించాలనుకుంది. కానీ, రష్మిక ఓవర్లో డియోల్ బౌల్డ్ కావడంతో 41వద్ద భారత్ మూడో వికెట్ పడింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌కు జోడీగా రీచా ఘోష్ (4 నాటౌట్) క్రీజులో ఉంది. 7 ఓవర్లకు స్కోర్.. 48-3.