రామగిరి, డిసెంబర్ 30 : నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు డా.సాగర్ల సత్తయ్య రచించిన కళా దర్పణం’ పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతీలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఏనుగు నర్సింహ్మరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ కళా సాహిత్యానికి పుట్టినిల్లు అని అభివర్ణించారు. కళా ప్రక్రియమై ప్రత్యేకించి విమర్శ వ్యాసాలు రావడం అభినందనీయమన్నారు. డాక్టర్ సాగర్ల సత్తయ్య కృషి అమ్యూలమని కీర్తించారు. ఈ కార్యక్రమంలో సృజన సాహితీ నల్లగొండ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, నల్లగొండ సాహితీవేత్తలు డా.తండు కృష్ణ కౌండిన్య, మాదగాని శంకరయ్య, శీలం భద్రయ్య, నిఖిల్ కుమార్, బంగారు శంకర్ పాల్గొన్నారు.