హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. శాసనసభలో, శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు.
అదేవిధంగా శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్ రమణ, పీఎస్ రెడ్డిలను నిర్ణయించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ పేరుతో పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.